calender_icon.png 29 December, 2024 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్లో రికార్డుల పరంపర

17-07-2024 06:58:36 AM

ముంబై, జూలై 16: మార్కెట్ ఏ రోజుకారోజు కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నది. వరుసగా మూడో ట్రేడింగ్ రోజున సైతం స్టాక్ సూచీలు లాభాలతో ముగిసాయి. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్  మరో 52 పాయింట్లు పెరిగి 85,716 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి  80,898 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 24,661 పాయింట్ల వద్ద నూతన రికార్డును నెలకొల్పింది. చివరకు 26 పాయింట్ల లాభంతో  కొత్త గరిష్ఠస్థాయి 24,612  పాయింట్ల  వద్ద ముగిసింది. 

ట్రేడింగ్ ప్రారంభంలో కొత్త రికార్డుల్ని నెలకొల్పిన అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్‌లో జరిగిన అమ్మకాల కారణంగా గరిష్ఠస్థాయి నుంచి సూచీలు కొంత దిగివచ్చాయని ట్రేడర్లు తెలిపారు. తాజా ర్యాలీలో ఎఫ్‌ఎంసీజీ, టెలికాం షేర్లు పాలుపంచుకున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు బలపడటంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతున్నందున వరుసగా మూడు రోజుల నుంచి మార్కెట్లో కొత్త రికార్డులు నెలకొంటున్నాయని విశ్లేషకులు తెలిపారు.

నేడు మార్కెట్లకు సెలవు

మొహర్రం కారణంగా బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు సెలవు.