హీరో నారా రోహిత్ 20వ చిత్రం ‘సుందరకాండ’. వెంకటేశ్ నిమ్మలపూడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. “ఇదొక పెక్యులర్ లవ్‌స్టోరీ (విచిత్రమైన ప్రేమకథ). ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్” అన్నారు. హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. “టీజర్ చూసినప్పుడు ‘ఈశ్వర్’ మూవీ డేట్స్ గుర్తుకువచ్చాయి” అన్నారు.
‘సుందరకాండ’లాంటి లవ్‌స్టోరీ ఎవరూ ఊహించలేరు. విందుభోజనంలా ఉంటుందీ ఈ సినిమా” అని సీనియర్ నటుడు నరేశ్ వీకే తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్లు వత్తి వాఘని, వాసుకి, నటుడు అభినవ్ గోమఠం, మూవీ టీమ్ పాల్గొన్నారు.
ఫన్ ఫుల్ టీజర్
నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన సంబంధాల కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం టీజర్‌లో ఉల్లాసంగా అనిపించింది. క్యారెక్టరైజేషన్, కామిక్ టైమింగ్‌తో హ్యుమర్ అందించే నారా రోహిత్‌కి ఈ క్యారెక్టర్ టైలర్ మేడ్‌గా కనిపిస్తుంది. అతని జోడిగా వృతి వాఘని ఆకట్టుకుంది. శ్రీదేవి విజయ్ కుమార్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. నరేశ్ విజయ కృష్ణ రోహిత్ తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు.
వాసుకి ఆనంద్ మరో కీలక పాత్రలో కనిపించారు. టీజర్‌లో చూపినట్లుగా, ఈ కథ ప్రతి వ్యక్తికి రిలేట్‌గా చేసుకునేలా ఉంది. దర్శకుడు దీన్ని ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ముఖ్య తారాగణం: వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, గణేశ్, అభినవ్ గోమఠం, విశ్వంత్, రూపలక్ష్మి, సునయన, రఘుబాబు; బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్; సంగీతం: లియోన్ జేమ్స్; ఎడిటర్: రోహన్ చిల్లాలే; ఆర్ట్ డైరెక్టర్: రాజేశ్ పెంటకోట; సాహిత్యం: శ్రీహర్ష ఈమని; యాక్షన్ కొరియోగ్రఫీ: పృథ్వీ మాస్టర్; డాన్స్ కొరియోగ్రఫీ: విశ్వ రఘు.