calender_icon.png 19 April, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయికి శిల్పానికి మధ్య జరిగే కథ!

10-04-2025 12:00:00 AM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాక్ కొంచెం క్రాక్’. శ్రీవేంకటేశ్వర సినీచిత్ర పతాకంపై ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవిచైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. టాలీవుడ్ దర్శకులు చందూ మొండేటి, కార్తిక్ దండు, కళ్యాణ్‌శంకర్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “టిల్లుస్క్వేర్’ తర్వాత ఇదే పర్ఫెక్ట్ సినిమా అనిపించింది. ఓ ఎడిటర్ లేకుంటే డైరెక్టర్లకు కాళ్లూచేతులు ఆడవు. జాక్ చిత్రాన్ని నవీన్ నూలి చక్కగా కట్ చేశారు. వైష్ణవి ఏవీ చూసినప్పుడు నాకు రోమాలు నిక్చబొడిచాయి. బేబీ చూసిన తర్వాత జాక్ హీరోయిన్ ఈమే అని ఫిక్స్ అయ్యాం. వైష్ణవి చాలా గొప్ప నటి. మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా.

బొమ్మరిల్లు భాస్కర్‌తో ఆరేంజ్ సినిమా చేసినప్పుడు ఎక్కువగా మాట్లాడే టైమ్ దొరకలేదు. ‘జాక్’ కోసం ఆయనతో ప్రయాణించా. 24 గంటలు సినిమా కోసమే ఆలోచిస్తుంటారు. ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’తో నాకు ఏర్పడ్డ టైమింగ్‌ను ‘జాక్’లో మిస్ అవ్వకుండా చేశారు బొమ్మరిల్లు భాస్కర్. ఎంతో స్వేచ్ఛనిచ్చారు. ఈ చిత్రం రెండు వందల శాతం అందరికీ నచ్చుతుంది’ అన్నారు. వైష్ణవిచైతన్య మాట్లాడుతూ.. ‘జాక్ చిత్రానికి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది.

ఈ ప్రయాణం నా జీవితాంతం గుర్తుంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి అద్భుతమైన డైరెక్టర్‌తో పనిచేయడం అదృష్టం. నా నటనతో డైరెక్టర్లను సంతృప్తి పర్చాలనుకుంటా.. వారి మొహంలో నవ్వు చూడాలనుకుంటా. సిద్ధూ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నా’ అని చెప్పారు. బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. ‘వైష్ణవి అద్భుత నటి. ఎలాంటి సీన్ అయినా సులభంగా నటించేశారు.

సిద్ధూలో తెలియని స్పార్క్‌ను ఎప్పుడో చూశాను. ఇప్పుడు అది వైల్డ్ ఫైర్‌లా ఉంటుంది. ఆయనలో చాలా స్పాంటేనిటీ ఉంటుంది. ‘జాక్’ మన అందరి కథ. ఒక రాయికి, శిల్పానికి.. ఒక తాబేలుకు, కుందేలుకు.. ఓ ఎయిర్‌బస్‌కు, ఎర్రబస్సుకు మధ్య జరిగే కథ’ అని తెలిపారు. ‘ఈ సినిమా పెద్ద హిట్ అవువతుందని ఆశిస్తున్నా’ అని నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ అన్నారు. మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.