calender_icon.png 19 January, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ముందడుగు

19-01-2025 12:56:47 AM

* డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం

* రూ.990 కోట్లు ఖర్చుచేయనున్న ప్రభుత్వం

విజయవాడ, జనవరి 18: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ముందడుగు పడింది. కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు షురువయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులు కాంట్రాక్ట్ సంస్థ ప్రారంభించింది. 1.396 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రమ్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించారు.

1.5 మీటర్ల వెడల్పుతో నదీ ప్రవాహమార్గంలో భూమి లోపల దీని నిర్మించనున్నారు. పాత డయాఫ్రమ్ వాల్‌కు 6 మీటర్ల పైన కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. సగం నిర్మాణం పూర్తికాగానే సమాంతరంగా దాని పైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌ను నిర్మించేందుకు కార్యాచరణ షెడ్యూల్ కూడా జారీ చేసింది. కొత్త డయాఫ్రమ్ వాల్ కోసం ప్రభుత్వం రూ.990 కోట్లు ఖర్చు చేయనుంది.