- ‘హిమాచల్’లో హెడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌లపై రాష్ట్రప్రభుత్వం ఆసక్తి
- ఢిల్లీలో ఆ రాష్ట్ర సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
- ప్రాజెక్ట్‌లపై ఎంవోయూలు పంపాలని ప్రతిపాదన
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దీనిలో భాగంగా బిల్డ్ ఆన్ ఆపరేట్ ట్సాన్స్‌ఫర్ (బూట్) విధానంలో హిమాచల్ ప్రదేశ్‌లో 22 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర విద్యుత్‌శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తా నియాతో కలిసి గురువారం ఢిల్లీలో హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌సింగ్ సుఖుతో భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఎంఈవోలు పంపాలని డిప్యూటీ సీఎం కోరారు.
భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ఎంవో యూ ముసాయిదాను పంపించాలని హిమాచల్ ప్రదేశ్ సీఎంను కోరామని స్పష్టం చేశారు. రెండు ప్రభుత్వాలు ఒప్పందాలను పరిశీలించి, అనంతరం వాటిపై సంతకం చేస్తామని వెల్లడించారు. అనంతరం హిమాచల్‌ప్ర దేశ్‌లోని ప్రాజెక్ట్‌ల పరిధిలో ఉత్పత్తయ్యే విద్యు త్ తెలంగాణకు సరఫరా అవుతుందన్నారు.
తద్వారా రాష్ట్ర విద్యుత్ అవసరాలతోపాటు భవిష్యత్ విద్యుత్‌కు డి మాండ్‌కు పరిష్కారం లభిస్తుందన్నారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ అధికారుల బృం దం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించింది. అక్క డి ఎస్‌ఈఎల్‌ఐ ప్రాజెక్టు (400 మెగావాట్లు), మియార్ ప్రాజెక్టు (120 మెగావాట్లు) ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేర కు రాష్ట్రప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది.