calender_icon.png 7 October, 2024 | 3:05 PM

టైటిల్‌కు.. అడుగు దూరంలో

06-10-2024 12:00:00 AM

  1. ఫైనల్లో గాఫ్, ముచోవా 
  2. చైనా ఓపెన్

బీజింగ్: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్‌లో టైటిల్ విజేతగా నిలిచేందుకు గాఫ్, ముచోవా అడుగు దూరంలో నిలిచారు. నేడు జరగనున్న తుది పోరులో ఈ ఇద్దరు అమీతుమీ తేల్చుకోనున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీస్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా) 4-6, 6-4, 6-2తో 15వ సీడ్ పౌలా బడోసా (స్పెయిన్)పై విజయం సాధించింది.

దాదాపు 2 గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో గాఫ్ తన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ రెండు, మూడు సెట్లలో ఫుంజుకున్న గాఫ్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో 6 ఏస్‌లు కొట్టిన గాఫ్ 11 డబుల్ ఫాల్ట్స్ చేసినప్పటికీ 56 విన్నర్లు సంధించింది. మరోవైపు 4 ఏస్‌లకు పరిమితమైన బడోసా 6 డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది.

ఇక మరో సెమీస్‌లో కరోలినా ముచోవా 6-3, 6 స్థానిక క్రీడాకారిణి జెంగ్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. గంటన్నర పాటు సాగిన మ్యాచ్‌లో ముచోవా 3 ఏస్‌లతో పాటు 2 బ్రేక్ పాయింట్లు, 25 విన్నర్లు సంధించింది. మూడు ఏస్‌లు కొట్టిన జెంగ్ 7 డబుల్ ఫాల్ట్స్ చేసింది.  

షాంఘై మాస్టర్స్

అల్కరాజ్, సిన్నర్ శుభారంభం

చైనా ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ షాంఘై మాస్టర్స్ టోర్నీలో శుభారంభం చేశాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 6 6 చైనాకు చెందిన షాంగ్‌ను చిత్తు చేశాడు. అల్కరాజ్‌కు ఇది వరుసగా 10వ విజయం. ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) కూడా రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు.

తొలి రౌండ్‌లో సిన్నర్ 6 6 జపాన్‌కు చెందిన టారో డేనియల్‌పై సునాయాస విజయాన్ని అందుకున్నాడు. సిన్నర్‌కు ఇది 250వ విజయం కావడం విశేషం. మ్యాచ్‌లో 12 ఏస్‌లు సంధించిన సిన్నర్ 38 విన్నర్లు సంధించాడు. రెండో రౌండ్‌లో సిన్నర్ అర్జెంటీనాకు చెందిన టోమస్ మార్టిన్‌ను ఎదుర్కోనున్నాడు.