calender_icon.png 22 February, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భువనగిరిలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

30-01-2025 12:00:00 AM

కలెక్టర్‌కు పద్మశాలి సంఘ నేతల వినతి 

యాదాద్రి భువనగిరి జనవరి 29 (విజయ క్రాంతి) ః తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేయాలని పద్మశాలి సంఘం జిల్లా నాయకులు కలెక్టర్ హనుమం తరావుకు వినతిపత్రం చేశారు.

తెలంగాణా రాష్ర్ట ఏర్పాటే లక్ష్యంగా పోరాడి తెలంగాణని శ్వాస, ద్యాసగా జీవించిన మహా నాయకుడు అని వివరించారు. ఆయన జ్ఞాపకార్థం పట్టణంలోని ముఖ్య కూడలిలో బాపూజీ విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయాలని కోరారు.

కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లందాస్ ఆదినారాయణ, జిల్లా అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు  ప్రధాన కార్యదర్శి చింతకింది శ్రీధర్ కోశాధికారి శ్రీరామ్ సత్తయ్య ఉపాధ్యక్షులు బింగి వైకుంఠం గౌరవ అధ్యక్షులు వంగరి బాల నరసయ్య రామకృష్ణంరాజు, యువజన విభాగం అధ్యక్షులు బింగి భరత్ కుమార్ పాల్గొన్నారు.