calender_icon.png 26 February, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి

25-02-2025 10:37:10 PM

ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ ఫోరం చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, రాజ్యాంగ న్యాయ శాస్త్ర పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ ఫోరం చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన వెల్లడించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ ) ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చీఫ్ జస్టిస్ నేతృత్వంలో గతంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. 

2024 స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహనీయుని విగ్రహంను ఏర్పాటు చేస్తామని హైకోర్టు చీఫ్ జస్టిస్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ హామీ నెరవేర్చటంలో భాగంగా విగ్రహం పునాది కూడా తెలంగాణ హైకోర్టులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాన్స్టిట్యూషన్ లా పితామహులు అంబేద్కర్ ను సరైన రీతిలో గౌరవించే ఉద్దేశంతో ఆయన ఆశలు సాధన కోసం సమతా సమాజం నిర్మాణానికి ప్రజాస్వామ్య సెక్యులర్, రిపబ్లిక్ బలమైన వ్యవస్థ దృడమైన ఇండియా, సమాజ నిర్మాణానికి జ్యుడీషియల్ వ్యవస్థలో ఆయన చెప్పిన సూత్రాలను అమలుపరచాల్సి ఉందన్నారు. 

ఆ మహనీయుని ఆశయ సాధనలో భాగంగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని విజ్ఞప్తి చేస్తూ చీఫ్ జస్టిస్ క్లారిటీ విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ సమతా లాయర్స్ ఆర్గనైజేషన్. ఐఎస్ఎల్ఓ అధ్యక్షులు పుట్ట పద్మారావు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి గోలి నరేష్, హైకోర్టు సామ్రాట్ నరేంద్ర, బోయిల్ల నరసింహ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.