calender_icon.png 3 November, 2024 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం పెట్టాలి

05-07-2024 01:23:04 AM

సీతారామరాజు 127 జయంతి సందర్భంగా మంత్రి సీతక్క డిమాండ్

ముషీరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): బ్రిటీష్ పాలకులను గడగడ లాడించిన మన్యంవీరుడు అల్లూరి సీతారామారాజు విగ్రహాన్ని పార్లమెంట్ ప్రాంగ ణంలో ప్రతిష్ఠించాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అల్లూరి విగ్రహం కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు. సాటి మనుషుల కోసం పనిచేసే దృక్పథాన్ని అంతా అలవర్చుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై అల్లూరి విగ్రహం వద్ద ఆయన 127వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి సీతక్క నివాళులు అర్పించారు.

అనంతరం మా ట్లాడుతూ.. 2 వందల ఏండ్ల పాటు దేశాన్ని పీడించిన బ్రిటీష్ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి వీరోచిత పోరాటాలు చేసిన గొప్ప వీరుడు అల్లూరి అని ఆమె ప్రశంసించారు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరా డి మరణించిన త్యాగశీలి అని, అల్లూరి అంటేనే పోరాటం, వెలుగు, స్ఫూర్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఏపీ మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సీతక్కను శాలువాతో ఘనంగా సత్కరించి అల్లూరి విగ్రహ ప్రతిమను బహూకరించారు.