బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): పసలేని, పనికిరాని పాగ ల్ పాలనలో తెలంగాణ ఆగమైతుందని.. కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో రాష్ట్రం అగ్ని గుండమైందని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. అసమర్థ సీఎం పాలనతో రాష్ట్రంలో కొంతకాలంగా అసంతృప్తి నెలకొన్నదన్నారు.
కుటుంబ దాహం కోసం తన ప్రాం తంపై కుట్రలు చేస్తే లగచర్ల ప్రజలు ఎదురొడ్డి పోరాటం చేశారన్నారు. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కి రైతన్నలు, హైడ్రా దౌర్జన్యాలపై జనం తిరుగుబాటు, మూసీలో కూల్చివేతలపై దుమ్మెతిపోస్తున్న బాధితులు, పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచులు, ఉపాధి దూరం చేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం వినిపిస్తున్నదన్నారు.
కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లో అసంతృప్తి, గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్ధులు ఆందోళన చేశారన్నారు.
గురుకులాల సమస్యలు పరిష్కరించాలి: హరీశ్‌రావు
రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్థితికి చేరినా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని మాజీ మంత్రి హరీశ్‌రా వు విమర్శించారు. కేసీఆర్ గురుకులాల ఖ్యాతిని ఎవరెస్టు శిఖరం ఎత్తున నిలబడితే, రేవంత్ తన 11 నెలల పాలనలో గురుకులాల పేరును దిగజార్చా రని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ పాలనకు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దం డ గురుకుల విద్యార్థులు చేస్తున్న నిరసన మరో నిదర్శమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.