calender_icon.png 16 January, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సచిన్‌కు స్టాండింగ్ ఒవేషన్

07-07-2024 12:31:29 AM

లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు సెంటర్ కోర్టు నుంచి స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. లండన్‌లో ఉన్న సచిన్ శనివారం మధ్యాహ్నం సెంటర్‌కోర్టులో మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా స్టేడియానికి వచ్చిన సచిన్‌కు వింబుల్డన్ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు చప్పట్లతో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి సచిన్‌ను గౌరవించారు. కాగా సచిన్‌తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్‌లు రాయల్ బాక్స్ నుంచి మ్యాచ్‌ను వీక్షించారు. గత కొన్నేళ్లుగా సచిన్ టెండూల్కర్ క్రమం తప్పకుండా వింబుల్డన్ టోర్నీకి హాజరవుతూ వస్తున్నాడు.