11-03-2025 12:58:45 AM
ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, మార్చ్ 10 (విజయక్రాంతి) : మండల కేంద్రాలలో స్టేడియం లను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. బేల మండలం కొబ్బయి గ్రామంలో సోమవారం నిర్వహించిన క్రికెట్ పోటీలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు.
అనంతరం సరదాగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాపరిచారు. ఎందరో యువకులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ సౌకర్యాలు లేకపోవడంతో అవకాశాలను కోల్పోతున్నారు ఎమ్మెల్యే అన్నారు. క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
రాష్ట్రానికి పేరు తీసుకువచ్చిన క్రీడాకారులలో గ్రామీణ క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దత్త నిక్కం, మురళీధర్, ఆదిత్య ఖండేష్కర్, గణేష్, నవీన్ రాకేష్ రత్నాకర్ రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.