calender_icon.png 22 February, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరవీడిన బతుకమ్మ కుంటలో జలధార!

19-02-2025 01:38:31 AM

మోకాలు లోతు తవ్వకానికే ఉబికి వచ్చిన నీళ్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 18: హైదరాబాద్‌లో ఏన్నో ఏళ్ల క్రితం ఆక్రమణ లకు గురైన బతుకమ్మ కుంటకు హైడ్రా తిరిగి జీవం పోస్తోంది. పునరుద్ధరణ చర్యల్లో భాగంగా మోకాలు లోతు తవ్వకానికే నీళ్లు ఉబికి వచ్చా యి. ఆక్రమణల తొలగింపు సత్ఫలితం ఇచ్చిం దంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

అంబర్‌పేట మండలం బాగ్‌అంబర్‌పేట్‌లోని సర్వే నంబరు 563లో 1962 లెక్కల ప్రకారం 14.06 ఎకరాల విస్తీర్ణంలో(బఫర్ జోన్‌తో కలిపి 16.13 ఎకరాలు) ఉన్నట్టుగా సర్వే అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉండగా.. మిగతాదంతా ఆక్రమణలకు గురైనట్టు అధికారులు నిర్ధారించారు.

బతుకమ్మకుంటకు జీవం పోయాలని, కబ్జా చెర నుంచి బతుకమ్మ కుంటను రక్షించాలంటూ గతంలో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బతుకమ్మ కుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రభుత్వ రికార్డుల మేరకు బతుకమ్మకుంట వివరాలను ప్రజలకు వివరించారు.

బతుకమ్మ కుంట పునరుద్ధరణలో రెం  పాటు చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించారు. మంగళవారం తవ్వకాలు ప్రారం  మోకాలు లోతు తవ్వగానే నీరు ఉ  వచ్చింది. ఇదిలా ఉండగా, బతుకమ్మ కుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించ  కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది.

దీంతో నాటి నుంచి కుంట పునరుద్ధరణ కో  హైడ్రా చర్యలు ప్రారంభించింది.  ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మ కుంటగా మా రినట్టుగా, రెవెన్యూ రికార్డులు సైతం ఇదే వి షయం వెల్లడిస్తున్నట్టు తేలింది. బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు తొలగింపు, సుందరీకరణ ఆదివారం ప్రారంభించారు.

జూన్ వరకు ఆరు చెరువులు..

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ వరకు నగరంలోని ఆరు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు ప్రారంభించినట్టు క  ఏవీ రంగనాథ్ తెలిపారు. వాటిలో బతుకమ్మ  కుంట (బాగ్ అంబర్‌పేట), బూ  దావాలా (పాత బస్తీ), తమ్మిడి కుం  (ఎన్ కన్వెన్షన్ పక్కన), సున్నం చెరు  (మాదాపూర్), నల్ల చెరువు (కూకట్‌ప  నల్ల చెరువు (ఉప్పల్) ఉన్నాయి. హెచ్   నిధులతో త్వరలో టెండర్లు వేసి పనులు ప్రారంభిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు.