28-04-2025 12:53:12 AM
తుంగతుర్తి, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఆదివారం 20002001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పదోతరగతి వరకు చదివిన విద్యార్థులు 24 ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకొని ఒకరికి ఒకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. అనంతరం తమకు పాఠాలు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆనాటి గురువులు కాసం మల్లయ్య, పాలవరపు సంతోష్, ఆకారపు రాములు, సుదర్శన్, ఓరుగంటి అంతయ్య, ముచ్చ సురేందర్ రావు, ఫజల్, మేనేని మాధవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు.
ప్రవీణ్ కుమార్, పూర్వ విద్యార్థులు రేగటి భాస్కర్, మల్లెపాక సాయిబాబా, ఎనగందుల రవి, కొమరయ్య, భాషమియా, సురేష్, వెంకన్న, కిరణ్, నిర్మల, మంజుల, ఉప్పలయ్య, కటకం నాగరాజు, వెంకన్న శ్రీకాంత్ గోపగాని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.