calender_icon.png 9 January, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3న ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

02-11-2024 02:17:19 AM

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు 

ఖమ్మం, నవంబర్ 1 (విజయక్రాంతి): ఉద్యోగులంతా సమైఖ్యంగా ఉండి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలన్నారు. ఇందుకోసం ఈ నెల 3వ తేదీన ఖమ్మంలోని చెరుకూరి మామిడి తోటలో 20 వేల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులతో భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, పెన్షనర్స్, ఉపాధ్యాయులు, కార్మికుల కుటుంబాలు ఈ సమ్మేళనంలో పాల్గొంటాయని చెప్పారు. ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం పెంచేందుకు క్రీడలు  కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో జేఏసీ నిర్వీర్యం అయిందని ఆరోపించారు. ఎన్నో సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. కొత్త ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఒక డీఏను మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. 53 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి, పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.