calender_icon.png 22 December, 2024 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

07-10-2024 11:25:15 AM

మానకొండూర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ పరిధిలోని తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ లో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 2003 04 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించుకొని స్నేహితులంతా ఒకచోట కలుసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత స్నేహితులంతా ఒకచోట కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకొని సంతోషంగా వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఉన్నత విద్యను అందించిన గురువులకు పాదాభివందనం అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గురువులు విద్యార్థులు పాల్గొన్నరు.