calender_icon.png 13 March, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

12-03-2025 12:00:00 AM

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): గుంటూరు పట్టాభిపురం మున్సిపల్ స్కూల్‌లో 1964 మధ్య చదివిన విద్యార్థులు ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత కలుసుకుని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యా బుద్ధులు నేర్పిన రాఘవేంద్రరావు, స్వరాజ్యలక్ష్మిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమం నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించిన రఘుకుమార్, పతంజలి, నరహరిరావు, సంధ్యశ్రీ, వరలక్ష్మి, అపర్ణలకు తోటి మిత్రులు కృతజ్ఞతలు తెలిపారు.