calender_icon.png 3 April, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

28-03-2025 12:00:00 AM

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి

ముషీరాబాద్, మార్చి 27: (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమా నికి ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్  రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గాంధీ నగర్ లోని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కార్యాలయంలో నిర్వహిం చిన మీడియా  సమావేశంలో తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రెంట్ అధ్యక్షులు మోహన్ బైరాగి, తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, జేఏసీ కోశాధికారి చంద్రన్న, మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి, ఉపాధ్యక్షులు సుజాత, స్వరూప రాణీ, వేముల యాదగిరి పాల్గొన్నారు.