calender_icon.png 18 January, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్‌సెట్‌కు విశేష స్పందన

05-07-2024 12:05:00 AM

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): టీజీ ఎప్‌సెట్ కౌన్సిలింగ్‌కు తొలిరోజు 56,674 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 12 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్ ఆధారంగా ఈనెల 6 నుంచి 13వ తేదీ మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. జూలై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 19న తొలి విడత సీట్లను కేటాయించనున్నారు.