25-04-2025 12:00:00 AM
ఆదివాసీల జీవితాల్లో ఇప్పపువ్వుతో విడదీయని అనుబంధం
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): ఆదివాసీల సంస్కృతి - సంప్రదాయాల్లో ఇప్పపువ్వుకు ప్రత్యేక స్థానం ఉందని ఖానాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటే ల్ అన్నారు. గురువారం ఉట్నూరు మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్ లోని పీఎంఆర్సీ భవనంలో నిర్వహించిన ఇప్పపువ్వు పండు గ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తాలతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఇప్పపువ్వు చెట్టుకు పూజలు చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇప్పపువ్వుతో తయారు చేసిన లడ్డు లు, జొన్న గట్కా, మక్క గట్క, గారెలు, పలు రకాల వంటకాల స్టాల్ ను పరిశీలించి, పలు వంటకాల రుచి చూసారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇప్పపువ్వుతో అనేక రకాల లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు. రక్తహితనతో బాధపడుతున్న వారికి ఇప్పపువ్వు లడ్డుతో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంద ని తెలిపారు. ఆదివాసీల జీవితాలతో ఇప్పపువ్వుతో విడదీయని అనుబంధం ఉందని, ప్రతి ఒక్కరూ ఇప్పపువ్వును వినియోగించాలన్నారు. నాడు జిల్లా కలెక్టర్ గా పని చేసి, నేడు సెర్ప్ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న దివ్య దేవరాజన్ ఇప్పపువ్వు పండుగను ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, జిల్లా సార్మేడి దుర్గు పటేల్, ఏపిఓ (పివిటీజి) మెస్రం మనోహర్, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.