calender_icon.png 3 April, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరె కటికల అభివృద్ధికి రూ. 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

29-03-2025 12:09:57 AM

ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ.భూంపల్లి అశోక్ కుమార్

ముషీరాబాద్, మార్చి 28: (విజయక్రాంతి): ఆర్థికంగా, సామాజికంగా, రాజ కీయంగా అన్ని రంగాల్లో వెనుకబడిన ఆరెకటిక కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే రూ. 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. భూంపల్లి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు శుక్రవారం బాగ్లింగంపల్లి  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ కుమార్ మాట్లాడుతూ బీసీ ’డీ’ నుండి బీసీ ’ఏ’ హోదా కల్పిస్తూ జీవో జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మటన్ షాపులకు కరెంటు ఉచితంగా ఇవ్వాలన్నారు. బొక్నా, బోటీ సెంటర్ల కోసం మహిళలకు రూ. 3 లక్షలు 90 శాతం సబ్సిడీతో ఏ షరతులు లేకుండా ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నారు.

ప్రభుత్వం వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ ఆరెకటికలకు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని మేకల  మండీలను ఆధునీకరించి ఆరెకటికలకు అప్పగించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్లలో ఆరెకటికలకు పూర్తి హక్కు కల్పిస్తూ జీవో తేవాలన్నారు. ప్రభుత్వం ధర్మ వ్యాధుడి విగ్రహాన్ని ట్యాంక్బండ్ పై ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రౌండ్ టేబుల్ సమావేశంలో గౌరవాధ్యక్షులు బి. కాజారాంజి, ప్రధాన కార్యదర్శి నందీశ్వర్ జి, ఉపాధ్యక్షుడు నాగ శేషు, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, జీజే రామ్ జీ, వెంకటేశ్వర్ జీ, జగదీశ్వర్ జి, వనజ, మంజు, నరేందర్, మదన్ లాల్, శ్రీలత, నరేందర్, సాయినాథ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.