calender_icon.png 31 October, 2024 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్‌ను నియమించాలి

31-10-2024 02:02:39 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 

ముషీరాబాద్, అక్టోబర్ 30: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని విద్యానగర్ బీసీ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీసీ నాయకులతో కలిసి మాట్లాడారు. కమిషన్ నివేదికతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు నీల వెంకటేశ్ ముదిరాజ్, గొరిగె మల్లేశ్ యాదవ్, నందగోపాల్, సుధాకర్, వేముల రామకృష్ణ, అనంతయ్య, రాఘవేందర్, ఉదయ్ నేత, రవి, మోడి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.