calender_icon.png 28 September, 2024 | 6:59 PM

లండన్‌లో ‘స్పెషల్’ అట్రాక్షన్!

26-09-2024 12:49:42 AM

సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ఇందులో కేకే మీనన్, సాకిబ్ సలీమ్ కూడా ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లండన్‌లో ‘సిటాడెల్: హనీ బన్నీ’ (ఇండియా) ‘సిటాడెల్: డయానా’ (ఇటలీ) వెబ్ సిరీస్‌ల ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో సమంత, నటి ప్రియాంక చోప్రాతో కలిసి పాల్గొన్నది. మరో నటి మటిల్డా డి ఏంజెలిస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. భారతదేశంలో విడుదలయ్యే ‘సిటాడెల్’ స్పిన్-ఆఫ్ సిరీస్‌లో సమంత కనిపించనుండగా, మటిల్డా ఇటాలియన్ వెర్షన్‌లో ముఖ్య పాత్రలో కనిపించనుంది. స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా తీసిన ఫొటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాతలు రాజ్, డీకేతోపాటు రస్సో బ్రదర్స్, ‘సిటాడెల్’ సిరీస్ నటీనట బృందం కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ రెండో సీజన్ షూటింగ్ ప్రారంభించింది. ప్రియాంకతోపాటు, స్టాన్లీ టుక్సీ, రిచర్డ్ మాడెన్, లెస్లీతో సహా నటీనటులు సిరీస్ రెండో విభాగంలోనూ తమ పాత్రల్లో కనిపించనున్నారు.