calender_icon.png 20 April, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుపు మెరిసే మనసు నింగిలో..

12-04-2025 12:00:00 AM

రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో.. రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్‌ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

ఇందులో కీరవాణి రచించిన తొలిపాట ఇటీవలే విడుదల కాగా, మంచి స్పందన లభించింది. తాజాగా రెండో పాటను హీరో రవితేజ ఆవిష్కరించారు. ‘ఇరు కనులు కనులు కలిసి మురిసె మొదటి చూపులో.. తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో..’ అంటూ రెహమాన్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్, విభావరి ఆలపించారు.