calender_icon.png 27 February, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నారి’ నుంచి రమణ గోగుల పాడిన పాట విడుదల

26-02-2025 10:41:27 PM

ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘నారి’. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శశి వంటిపల్లి నిర్మించారు. ‘నారి’ సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న విడుదల కానుంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుంచి రమణ గోగుల పాడిన ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ పాటను రిలీజ్ చేశారు. వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డిపై ఈ పాటను చిత్రీకరించారు. వినోద్ కుమార్ విన్ను ఈ పాటను కంపోజ్ చేశారు. ఆర్పీ పట్నాయక్, సునీత, చిన్మయి శ్రీపాద వంటి పేరున్న గాయనీ గాయకులు ‘నారి’ చిత్రంలోని సాంగ్స్ పాడటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.