calender_icon.png 2 November, 2024 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైగోమాటిక్ ఇంప్లాంట్స్‌తో పరిష్కారం

01-07-2024 12:10:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): జైగోమాటిక్ ఇంప్లాంట్స్‌తో దవడ ఎముక సమస్య తీవ్రంగా ఉన్న రోగులకు ఆధునిక పరిష్కారం లభిస్తుందని ఏఐఏడీ సొసైటీ అధ్యక్షుడు, ప్రముఖ దంత వైద్యుడు సునీల్‌కోతావర్ తెలిపారు. ఆదివారం ఏఐఏడీ ఆధ్వర్యంలో జైగోమాటిక్ ఇంప్లాంట్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కోతావర్ మాట్లాడుతూ సాధారణంగా ఇంప్లాంట్లు వేయడానికి బలమైన ఎముక అవసరమవుతుందన్నారు. కానీ పై దవడ ఎముక తక్కువ ఉన్న వ్యక్తులకు రెగ్యులర్ ఇంప్లాంట్లు వేయడానికి సవాళ్లు ఎదురవుతుండడంతో జైగోమాటిక్ ఇంప్లాంట్లు వేస్తున్నామన్నారు. జైగోమాటిక్ ఇంప్లాంట్లు రెగ్యులర్ ఇంప్లాంట్ల కంటే పొడవుగా ఉంటాయని చెప్పారు. జైగోమా ఎముక నుంచి సపోర్ట్ తీసుకోవడం ద్వారా దట్టంగా స్థిరమైన పునాదిని ఇస్తుందన్నారు. సరైన నైపుణ్యం, సాంకేతిక పద్ధతులతో జైగోమాటిక్ ఇంప్లాంట్లు చిరునవ్వులను పునరుద్ధరిస్తాయని పేర్కొన్నారు.