calender_icon.png 28 October, 2024 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయాల అభివృద్ధికి పటిష్ట ప్రణాళిక

12-08-2024 12:13:32 AM

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పౌర గ్రంథా లయాల అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ తెలిపారు. ఆదివారం అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రం థాలయంలో ఆయన ఆధ్వర్యంలో మేధోమదన సదస్సు నిర్వహించారు. రియాజ్ మాట్లాడుతూ.. గ్రంథాలయాల్లో సిబ్బంది నియామకం, గ్రంథాలయాల సెస్‌ల వసూ లు విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ, పౌర గ్రంథాలయ సం చాలకులు ఏవీఎన్‌రాజు, ఓయూ ప్రొఫెసర్లు లక్ష్మణరావు, సుదర్శన్‌రావు, సిటీ కాలేజీ గ్రంథపాలకులు రవికుమార్, ప్రముఖ కవులు యాకుబ్, స్కైబాబా, మంచిపుస్తకం పబ్లికేషర్ సురేష్ పాల్గొన్నారు. 

నేడు గ్రంథాలయ దినోత్సవం...

జాతీయ గ్రంథాలయాల పితామ హుడు డా.ఎస్‌ఆర్.రంగనాథన్ జయంతి సందర్భంగా అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో సోమవారం ఉదయం 11గంటలకు  జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పౌర గ్రం థాలయ శాఖ రాష్ట్ర సంచాలకులు ఏవీరాజు తెలిపారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.రియాజ్ అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.