calender_icon.png 23 November, 2024 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన సామాజిక కార్యకర్త

23-11-2024 04:30:33 PM

మునగాల (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సర్వేలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు శనివారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త గంధం సైదులు మునగాల మండల కేంద్రంలోని పలు వార్డుల్లో ఎన్యుమరేటర్ల నిర్వహిస్తున్న కుటుంబ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని మొత్తం కుటుంబాలను సర్వే చేసి వలస వెళ్లిన కుటుంబాల వారి సమాచారం తెలుసుకుని వారి వివరాలు కూడా సర్వేలో నమోదు చేయించాలని ఎన్యుమరేటర్లను కోరడం జరిగింది. ప్రజలు కూడా సర్వేకు సహకరించి ఎన్యుమరేటర్లకు సహకరించి వివరాలను సమగ్రంగా తెలియజేయాలని అన్నారు.