06-02-2025 06:30:01 PM
కొండపాక (విజయక్రాంతి): కుకునూరుపల్లి మండల చిన్న కిష్టాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం కుకునూరుపల్లి మండలానికి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన రామ్ ప్రసాద్ ను కుక్కునూరు పల్లి మండల బిజెపి అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం చిన్న కిస్టాపూర్ గ్రామంలో ఉన్న సమస్యలు స్ట్రీట్ లైట్స్, పారిశుద్ధ నిర్వహణ, మిషన్ భగీరథ వాటర్ సప్లై మొదలైన సమస్యలపై చర్చించారు. అనంతరం ఎంపీడీవో రాంప్రసాద్ మాట్లాడుతూ... గ్రామంలో ఉన్న సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సంతోష్ చారి, జైపాల్ రెడ్డి, బారసా నాయకులు రాజు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.