calender_icon.png 31 October, 2024 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపీ స్వల్ప రికవరీ

22-06-2024 12:05:00 AM

ముంబై, జూన్ 21: గురువారం రికార్డు కనిష్ఠస్థాయికి పతనమయిన రూపాయి శుక్రవారం స్వల్పంగా కోలుకున్నది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కె ట్లో క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 4 పైసలు పెరిగి 83.57 వద్ద ముగిసింది. క్రితం రోజు ఇంట్రాడే ట్రేడింగ్‌లో డాలరు మారకంలో రూపాయి విలువ ఒక్కసారిగా 24 పైసలు పడిపోయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.68 వద్ద కనిష్ఠస్థాయిని తాకి,  చివరకు 83.61 వద్ద నిలిచింది.

ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు స్థిరంగా ఉండటం, రిజర్వుబ్యాంక్ డాలర్లు విక్రయించడంతో రూపా యి కనిష్ఠస్థాయి నుంచి రికవరీ అయ్యిందని బీఎన్‌పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. అయితే ప్రపంచ మార్కెట్లో అమెరికా కరెన్సీ బలపడుతున్నందున రూపాయి గణనీయంగా కోలుకోలేకపోయిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. దేశంలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబ డులు కొనసాగడంతో పాటు ఫారెక్స్ మార్కె ట్లో ఆర్బీఐ మరింతగా జోక్యం చేసుకుంటే రూపాయికి కనిష్ఠస్థాయి వద్ద మద్దతు లభిస్తుందని వివరించారు. 

83.20 శ్రేణిలో ట్రేడింగ్

వచ్చే కొద్ది రోజుల్లో యూఎస్ డాలర్/ఇండియన్ రూపీ పెయిర్ 83.20 శ్రేణి మధ్య కదలవచ్చని అనూజ్ చౌదరి అంచనా వేశారు. మరో విశ్లేషకుడు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది రూపాయి 83.35 రేంజ్‌లో ట్రేడ్ కావచ్చని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.20 శాతం బలపడి 105.4 సమీపంలో కదులుతున్నది. బ్రెంట్ క్రూడ్ ధర 85 డాలర్ల స్థాయికి ఎగువన ట్రేడవుతున్నది.