calender_icon.png 20 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరవైల పడుసోడు.. ‘ముత్తయ్య’!

18-04-2025 12:00:00 AM

కే సుధాకర్‌రెడ్డి, అరుణ్‌రాజ్, పూర్ణచంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకుడు. వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ నిర్మాతలు. త్వరలో ఈ సినిమా ఈటీవీ విన్‌లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలోని ‘అరవైల పడుసోడు..’ అనే పాటను రిలీజ్ చేశారు.

‘అరవైల పడుసోడు ఎగిరెగిరి పడతాడు తుమ్మాకో తంబాకో తెలవదులేండి.. ఇరవైలా ముసలోడు ఎవ్వనికీ ఇనడీడు తుండేసి బండేసె ఆగం సుండి..’ అంటూ సాగుతున్న ఈ గీతానికి కార్తీక్ రోడ్రిగ్వ్ స్వరాలు, శివకృష్ణచారి ఎర్రోజు సాహిత్యం సమకూర్చగా, విద్యాసాగర్ బంకుపల్లి పాడారు.