బిజిమ్ స్టూడియో బ్యానర్‌పై వస్తున్న కొత్త సినిమా ‘చిట్టి పొట్టి’. రామ్ మిట్టకంటి, కష్వి, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంతో భాస్కర్ యాదవ్ దాసరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా శుక్రవారమే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా; ఎడిటర్: బాలకృష్ణ బోయ; సంగీతం: శ్రీ వెంకట్; సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి.