calender_icon.png 23 December, 2024 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘రాజా సాబ్’ నుంచి వరుస అప్‌డేట్స్..

15-10-2024 12:00:00 AM

మారుతి, ప్రభాస్ కాంబోలో వస్తున్న చిత్రం ‘రాజా సాబ్’. పీపుల్ మీడి యా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అప్‌డేట్స్ కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

దీనిపై తాజాగా ఈ చిత్ర సహ నిర్మాత శ్రీనివాస కుమార్ ‘ఘటికాచలం’ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ “అక్టోబర్ 23 (ప్రభాస్ పుట్టినరోజు) నుంచి సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్ వస్తాయి. దీనికోసం ఇప్పటికే మారుతి, నిర్మాత విశ్వప్రసాద్ ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలోనే రాజా సాబ్ అప్‌డేట్స్ గురించి వెల్లడిస్తాం” అని తెలిపారు. రాజా సాబ్ చిత్రం 10 ఏప్రిల్ 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.