calender_icon.png 29 November, 2024 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం

29-11-2024 06:39:04 PM

బీఆర్ఎస్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి ఆజం అలీ 

మలక్ పేట (విజయక్రాంతి): బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని బిఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి, ఆజం అలీ, మలక్ పేట్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ తీగల అజిత్ రెడ్డిలు పేర్కొన్నారు. దీక్ష దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అక్బర్ బాగ్ దిల్ కుశ ఫంక్షన్ హాల్ లో చావుని డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు, కేసీఆర్ సేవాదళం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు హయత్ హుస్సేన్ హబీబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన, కంటి వైద్య శిబిరాలను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2009వ సంవత్సరం నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఏం నిరాహారదీక్ష చేపట్టడంతో అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని, కెసిఆర్ సారధ్యంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం జరిగిందని తెలిపారు.

నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 11 రోజుల పాటు దీక్ష దివాస్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, మలక్ పేట్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దూరదృష్టతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల మూలంగా తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని కెసిఆర్ ఎంతో అభివృద్ధి చేశారని వివరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. 

బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు హయత్ హుస్సేన్ హబీబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరం విజయవంతం అయింది. పలువురు నాయకులు కార్యకర్తలు రక్తదానాన్ని చేశారు. అదేవిధంగా పలువురు కంటి పరీక్షలను చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామా ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి లయక్ ఆలీ, మాజీ వైస్ చైర్మన్ భూమేష్, డివిజన్ అధ్యక్షులు జగన్, మారుతి, పగిల శ్రీనివాస్ రెడ్డి, కామేష్, నాయకులు గౌర శశిధర్, శ్రీధర్ రెడ్డి, టిన్ను సింగ్ తదితరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ తరలిన నాయకులు బిఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఆజం అలీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తెలంగాణ భవన్ కు తరలివెళ్లారు.