27-03-2025 01:02:12 AM
పార్లమెంటులో ఎంపీ ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బుధవారం పార్లమెంటులో రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ య్య కోరారు. కేంద్రంలో 58 కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వంలో 93 విభాగాలు ఉన్నాయని.. కానీ నేటికీ ఓబీసీ మంత్రిత్వ శాఖ కలగానే మిగిలిపోయిందన్నారు.
ఓబీసీల సంక్షేమ అభివృద్ధిని చూసుకోవడానికి ప్రత్యేక విభాగం లేద న్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు తదితర అనేక సామాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయని.. ఓబీసీలు ఏం పాపం చేశా రని ప్రశ్నించారు. దేశంలో మెజారిటీ జనాభాకు మంత్రిత్వ శాఖ లేకపోవడం అన్యాయమన్నారు.