-చేతి వృత్తిదారుల సంఘం డిమాండ్
మునుగోడు, నవంబర్ 10: ప్రభుత్వాలు చేతి వృత్తుల అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, గం జి మురళిధర్ కోరారు. ఆదివారం మునుడోడులోని అమవీరుల భవనంలో కర్నాటి వెంకటేశం అధ్యక్షతన నిర్వహించిన చేతివృత్తిదారుల ని యోజకవర్గ స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. చేతి వృత్తిదారుల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని, జనాభా దామాష ప్రకా రం బడ్జెట్లో వాటా పెంచాలని కో రారు. సమావేశంలో నాయకులు ధ నుంజయ, సాగర్ల మల్లేష్, మూత్యా లు, లింగయ్య, శ్రీను, వెంకన్న, రాజయ్య, అంజయ్య, రామలింగాచారి, నరేందర్ పాల్గొన్నారు.