calender_icon.png 13 November, 2024 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతివృత్తుల కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలి

10-11-2024 04:59:55 PM

మునుగోడు (విజయక్రాంతి): పాలక ప్రభుత్వాలు చేతివృత్తుల కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, గంజి మురళీధర్ అన్నారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని అమరవీరుల భవనంలో చేతి వృత్తిదారుల నియోజకవర్గ స్థాయి కర్నాటి వెంకటేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. చేతివృత్తిదారుల కుటుంబాలకు ఉచిత కరెంటు ఇవ్వాలిని, జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో వాటా పెంచాలని అన్నారు. ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించి వృత్తుల భారీగా నిధులు కేటాయించి వృత్తుల ఫెడరేషన్ ఏర్పాటు, విధి విధానాలు రూపొందించి వృత్తిరక్షణ, వృత్తిసంక్షేమ కోసం ప్రభుత్వాలు పాటుపడాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వృత్తిసంఘాల నాయకులు జెర్రిపోతుల ధనంజయ, సాగర్ల మల్లేష్, వరికుప్పల ముత్యాలు, చిట్టిమల్ల లింగయ్య, యాసరాణి శ్రీను, దొండ వెంకన్న, కొంక రాజయ్య, బురకల అంజయ్య, రామలింగ చారి, నారపాక నరేందర్ తదితరులు పాల్గొన్నారు.