calender_icon.png 15 January, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబాయ్ యువరాణి సంచలన నిర్ణయం

18-07-2024 01:00:25 AM

సోషల్ మీడియా వేదికగా భర్తతో కటీఫ్

న్యూఢిల్లీ, జూలై 17: దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ తన భర్తతో విడిపోతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. ప్రియమైన భర్తకు అని రాసుకొస్తూనే ‘ఐ డైవర్స్ యూ’ అని బాంబ్ పేల్చారు. అంతే కాకుండా ఒకరికొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేశారు. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఇది సాహసోపేతమైన నిర్ణయం అని షైకాపై కొంత మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.