calender_icon.png 25 February, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

25-02-2025 12:53:30 AM

సీపీఐ మండల కార్యదర్శి సుదర్శన్ రెడ్డి

దేవరకొండ, ఫిబ్రవరి 24 :  కొండమల్లేపల్లిలో కందుల కొనుగోలు కేం ద్రం ఏర్పాటు చేయాలని సీపీఐ దేవరకొండ మండల కార్యదర్శి దేప సుదర్శన్రెడ్డి కోరా రు. సోమవారం దేవరకొండలోని పల్లా పర్వత్రెడ్డి భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రం అందు బాటులో లేకపోవడంతో కందులు పండించి రైతులు నిల్వ చేసుకోలేక ఇబ్బంది పడుతు న్నారని తెలిపారు.

మార్కెటింగ్ వ్యవసా యశాఖ గతేడాది కొండమల్లేపల్లిలో కొను గోలు కేంద్రం  ఏర్పాటు చేయడంతో ఇబ్బం దులు తప్పాయన్నారు. సమావేశంలో నాయకులు పల్లా రంగారెడ్డి, వలమల్ల ఆంజనేయులు, గోవర్ధన్ తదితరులున్నారు.