calender_icon.png 11 January, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెకండ్ షెడ్యూల్ పూర్తిచేసిన కిల్లర్

20-12-2024 12:00:00 AM

దర్శకుడు పూర్వాజ్ ‘కిల్లర్’ అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. జ్యోతి పూర్వజ్ హీరోయిన్. మరో ఇద్దరు హీరోలుగా విశాల్‌రాజ్, గౌతమ్ నటిస్తున్నారు. ఏయూఅండ్‌ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఏ పద్మనాభరెడ్డి.  ఈ సినిమా పార్ట్ 1 డ్రీమ్‌గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటోంది. సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మరో ఇద్దరు హీరోలు విశాల్ రాజ్, గౌతమ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జగదీశ్ బొమ్మిశెట్టి; సంగీతం: అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం.