calender_icon.png 12 January, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం సేకరణలో దేశానికి రోల్ మోడల్‌

04-12-2024 03:00:37 AM

* మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): వరి సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థలో  దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని కేంద్ర ఆహార కార్యదర్శి ప్రశంసించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆ శాఖ కార్యాలయంలో గత ఏడాది కాలంలో పౌరసరఫరాల శాఖ   సాధించిన విషయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానామిక్ రిలేషన్స్ నిర్వహించిన అధ్యయనంలో తెలంగాణలో పీడీఎస్ రీసైక్లింగ్ 0.3శాతం ఉండగా, గుజరాత్‌లో 43శాతం ఉందన్నారు.

  ప్రభుత్వం డిఫాల్ట్ మిలర్లపై కఠిన చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే 79 క్రిమినల్ కేసులు నమోదు చేసి, 41 మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా రూ. 1069. 63 కోట్లు, డిఫాల్టర్లు డిపాజిట్ రూ. 408 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కార్పొరేషన్‌పై రూ. 47,014 కోట్లు రుణం ఉందని, గత ప్రభుత్వంలో రూ. 58,623 కోట్లు ఉండగా ఈ ఏడాదిలో రూ. 11,608 కోట్లు రుణం తీర్చినట్లు మంత్రి వెల్లడించారు.