calender_icon.png 13 January, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ వినియోగంపై రోడ్ మ్యాప్ రూపొందించాలి

19-07-2024 01:10:42 AM

అధికారులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశం

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): వచ్చే 20 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వ పాలన, పారిశ్రామిక రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారు లకు సూచించారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీల్లో బ్రిటిష్ హై కమిషన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈఅండ్‌వై) సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గురువారం బ్రిటిష్ హై కమిషన్, ఈ అండ్ వై ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయంలో సమావేశమయ్యారు. గ్లోబల్  సామర్థ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంలో సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబు వారిని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీలో బ్రిటిష్ హై కమిషన్, ఎర్నెస్ట్ సంస్థలు కీలక భాగస్వాములు కావాలని కోరారు. సైబర్ సెక్యూరిటీలో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి హై కమిషన్ ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ సమా వేశంలో బ్రిటిష్ హై కమిషన్‌కు చెందిన లారా బాల్ విన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులు వికాస్ అగర్వాల్, నవీన్ కౌల్, కిరణ్ వింజమూరి, రాష్ట్ర ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.