22-12-2024 01:44:46 AM
వరల్డ్ రికార్డు కోసం ఆదివారం కొప్పూరులో..
భీమదేవరపల్లి, డిసెంబరు 21: ప్రపంచ రికార్డులో స్థానం కోసం 1,001 మంది మహిళలతో హనుమాన్ చాలీసా పారాయణంపై కోలాట నృత్యప్రదర్శన నిర్వహించ నున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌లోని పంచముఖ ఆంజనేయస్వామి వారి ఆలయం వద్ద ఆదివారం ప్రదర్శన జరుగుతుందని ఆలయ వ్యవస్థాపకులు కాసం రమేశ్, మాజీ జడ్పీటీసీ గద్ద సమ్మయ్య శనివారం వెల్లడించారు.
పంచముఖ ఆంజనేయ స్వామివారి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపింపజేసేం దుకు మహిళలతో కోలాట నృత్యప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హనుమాన్ చాలీసాపై 10నిమిషాల పాటు మహిళలు నృత్యప్రదర్శన చేస్తారని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బొజ్జపురి అశోక్‌ముఖర్జీ, ఆలయ అర్చకులు ఉపేందర్ శర్మ, గూటం జోగిరెడ్డి, తణుకు వెంకటేశ్, ఈదులకంటి రమాదేవి, జైపాల్‌రెడ్డి, వంగ సంపత్, రాంపల్లి తిరుపతి పాల్గొన్నారు.