calender_icon.png 24 November, 2024 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ నియంత్రణపై సమీక్ష

24-11-2024 12:18:20 AM

సూర్యాపేట: జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఎంపీహెచ్‌ఏ, ఆరోగ్య కార్యకర్తలతో శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కోటాచలం జిల్లా కేంద్రంలో కుటుంబ నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చాలాకాలంగా స్త్రీలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయకుండా నిలిపివేయడం జరిగిందన్నారు. దీంతో వారు తాత్కాలిక పద్దతులను అవలంబిస్తున్నారన్నారు. కానీ శాశ్వతంగా ఆపరేషన్ చేయించుకోవాలనుకునే మగవారికి ఈ నెల 28 నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాకానలో వేసక్టమీ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి గాను ప్రతి పీహెచ్‌సీ పరిధి నుండి ఐదుగురు మగవారికి తగ్గకుండా ఆపరేషన్‌కు వైద్యసిబ్బంది తీసుకరావాలన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్‌లు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, అనితారాణి, నాజియా, స్టాటిస్టికల్ ఆఫీసర్ వీరయ్య, ఏఎస్‌ఓ మత్స్యగిరి, డీపీఓ ఉమ తదితరులు పాల్గొన్నారు.