24-03-2025 12:11:15 AM
పెబ్బేరు మార్చి 23: స్తానిక సరస్వతి విద్యానికేతన్ 2006 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం సహారా ఫంక్షన్ హాల్ లో జరిగింది. పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు కలిసి వేడుక నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన, సరస్వతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
చదువు నేర్పిన గురువులకు సన్మాన కార్యక్రమం నిర్వహణ అనంతరం, వారి వారి మధురానుభూతులను చిననాటి మితృల తో పంచుకున్నారు. కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు రవీందర్, బాలరాజ్, ఎల్ రాజశేఖర్, వెంకటేష్, సూర్య కర్ణ,రాఘవేందర్ గౌడ్, శాంతన్న, సరస్వతి, సునీత పూర్వ విద్యార్థులు ప్రవీణ్ కుమార్, రామస్వామి, భాను ప్రకాష్, ఎల్లయ్య, మల్లికార్జున్, శివకుమార్, రమేష్ రఘువర్ధన్, మేఘన, జ్యోతి, గౌతమి, నాగలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.