నోముల భగత్ క్వార్టర్ ఖాళీపై అప్పీలు ఉపసంహరణ
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉంటు న్న క్వార్టర్ వివాదంలో అప్పీలు దాఖలు చేసి న రాష్ట్ర ప్రభుత్వం దానిని వెనక్కి తీసుకుంది. ఈ వివాదాన్ని సింగిల్ జడ్జి వద్ద తేల్చుకుంటామని చెప్పింది. నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో క్వార్టర్‌కు నోటీసు ఇవ్వకుండా సీలు వేయడాన్ని సవాలు చేస్తూ భగత్ దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో సింగిల్ జడ్జి విచారించి సీలును తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశా రు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని సింగిల్ జడ్జి వద్దనే తేల్చుకోవాలని బెంచ్ సూచన చేసింది. దీంతో ప్రభుత్వం అప్పీల్‌ను వాపస్ తీసుకుంది.