calender_icon.png 15 January, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌పై ప్రతీకార సుంకం తప్పదు

19-12-2024 01:14:51 AM

* ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్, డిసెంబర్ 18 : అమెరికా ఉత్పత్తులపై భారత్ 100నుంచి 200 శాతం వరకు ఎక్కువ సుంకం వసూలు చేస్తున్నదని, తాను అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వా త భారత్‌కు ప్రతీకార సుంకం విధిస్తామని రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫ్లోరిడాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్య లు చేశారు. ‘ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది. భారత్ మాపై 100 శాతం సుంకం విధిస్తే, మేం ఎందు కు విధించకూడదు?’ అని వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల ముందు సైతం ట్రంప్ ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు.  ఆయన భారత్‌పైనే కాక చైనా, బ్రెజిల్ వంటి దేశాలపైనా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు.