calender_icon.png 11 January, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్స్‌లో విజయంతో గౌరవమైన జీవితం

31-12-2024 02:49:59 AM

* ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ మెంటర్ భవానీశంకర్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30(విజయక్రాంతి): సివిల్ సర్వీసుల్లో విజయం సాధించడం వల్ల సమాజంలో గౌరవమైన జీవితాన్ని గడపొచ్చని ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ మెంటర్ డా.భవానీశంకర్ అన్నారు.

సోమవారం మెహిదీపట్నంలోని జీ పుల్లారెడ్డి డిగ్రీ కాలేజీలో వింగ్స్ మీడియా, జీ5 మీడియా గ్రూప్ ద్వారా ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ సహకారంతో ‘మొదటి ప్రయత్నం లోనే సివిల్ సర్వీసెస్ సాధించడమెలా యూపీఎస్సీ మాస్టర్ క్లాస్’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా భవానీశంకర్ మాట్లాడుతూ.. యూపీఎస్సీ పరీక్షకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పరీక్ష కఠినత్వంపై ఉన్న అపోహలను తొలగించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డా.వెంకయ్య, పుల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కే మురళీకృష్ణ, వింగ్స్ మీడియా, జీ5 మీడియా గ్రూప్ డైరెక్టర్లు గిరిప్రకాశ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.