calender_icon.png 3 April, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబికేఎంఎస్ జాతీయ కమిటీలో జిల్లా వాసీకి స్థానం

01-04-2025 08:23:22 PM

మంచిర్యాల (విజయక్రాంతి): దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల సమస్యల సాధన కోసం అఖిల భారతీయ కథాన్ మజ్దూర్ సంఘ్ (ఏ బి కే ఎం ఎస్) - బిఎంఎస్ నియమించిన ఇన్చార్జిలలో సింగరేణి విభాగం నుంచి మొదటి సారిగా రక్షణ కమిటీ సభ్యునిగా జిల్లాకు చెందిన నాతాడి శ్రీధర్ రెడ్డి నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణి కార్మికుల సమస్యలపై, వారి రక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోరాడుతానని అన్నారు. బొగ్గు గని కార్మికుల సమస్యల సాధనకు, నిరంతరం సమస్యల పరిష్కారం చేయడానికి, కార్మికులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎస్ సి ఎం కె ఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్యకి, ఏబీకేఎంఎస్ ప్రధాన కార్యదర్శి సుజిత్ సింగ్, రాష్ట్ర, జాతీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.