నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలానికి కేంద్రానికి చెందిన డి.వెంకటేష్ గల్ఫ్ దేశంలో మృతి చెందినట్లు ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం వెళ్లిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 24న మృతి చెందినట్లు తెలిపారు. అక్కడ అధికారులు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఆదివారం సొంత గ్రామాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు.